Friday, May 22, 2009

పల్నాటి వీర చరిత్ర - 2

కన్నమదాసు - బ్రహ్మనాయుఁడి వరంవల్ల బెమ్మసానికిఁ పుట్టినవాడు. కావున ఇతనూ, బహ్మనాయుఁడి కుమారుడిగానే ప్రసిద్ధి.
దొడ్డనాయుఁడు మంత్రిగా, అనుగురాజు కొంతకాలం పరిపాలించి కాలధర్మం చేసాడు. దొడ్డనాయుఁడు కూడా కాలం చేసాడు.
నలగామరాజు పట్టాభిషిక్తుడయ్యాడు. నాయకురాలు అను ఒక యువతి, నిజశక్తిచేత అనుగురాజు అనుగ్రహం సంపాదించింది. అనుగురాజు చనిపోయినాక, నలగామరాజువద్ద మంత్రిణి అయ్యింది. ఈ నాయకురాలి అసలుపేరు నాగాంబ. నాయకురాలిగా ప్రసిద్ధి.
నాయకురాలి నాగాంబ జన్మస్థలం పల్నాడుతాలూకాలో నాగులేటిఒడ్డున ఉన్న చిట్టిగామాలపాడు అనే ఒక చిన్నగ్రామం. ఈమె రెడ్లకులములో పుట్టింది. తండ్రిపేరు ఛౌదరిరామిరెడ్డి. ఈమె మేనమామ పేరు మేకపోతు సింగారెడ్డి. ఈమె యింటిపేరు రవల్లివారు అనిచెప్పఁబడింది. ఇది తల్లిగారి ఇంటిపేరో మరి అత్తగారి ఇంటిపేరో తెలియదు.ఈమె భర్త పేరు ఎక్కడా లేదు.
పల్నాటి యుద్ధానికి ఈమే కారణం.
గురిజాల పురాధీశులు నలగామరాజు ఈమె చేతిలో కీలుబొమ్మ.
ఈమె బ్రహ్మనాయుఁనికి పోటీగా రాజ్యతంత్రం నడిపిన మహా సమర్ధురాలు.
యుద్ధం చివరివరకూ అశ్వారూఢయై బ్రహ్మనాయునితో పోరాడిన సమర్ధురాలు.
[నాగమ్మ గురించిన ఒక చిన్న వ్యాసం - సాక్షి దినపత్రికలో ఇక్కడ చూడండి http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=133998&subcatid=17&categoryid=3]

నాయకురాలు నాగాంబ మంత్రిణి అయ్యేప్పటికి వీరవిద్యాదేవికి పుట్టిన మల్లదేవాదులు పిల్లలు. బ్రహ్మనాయుఁడు వీరిని దగ్గఱకుఁ తీసి రాజ్యంలోఁ కొంతభాగం ఇప్పించి, గురిజాలనుండి పోయి మాచెర్ల పట్టణం నిర్మించుకొని వారిది యుక్తవయస్సుకానందున, వారికిఁ బదులుగా తనే పరిపాలిస్తూ, వాళ్ళకి యుక్తవయస్సు రాంగనే కళ్యాణ పట్టణాధీశుఁడైన వీరసోముని కుమార్తెనిప్పించి పెదమల్లదేవునికి పెళ్ళిజేసి మాచెర్లకు పట్టాభిషికేం చేసాడు.
అనుగురాజు చనిపోవునప్పుడు కొడుకులందర్నీ బ్రహ్మనాయుఁడికి ఒప్పగించాడు. నలగామరాజు నాయకురాలిని మంత్రిణిగాఁ జేస్కున్నా మల్లదేవులకుఁ పెళ్ళి చేసిన తర్వత బ్రహ్మనాయుఁడు ద్వేషబుద్ధిలేకుండా నలగామరాజుకు భూరమాదేవి పుత్రులకుఁ కట్నం ఇవ్వటానికి గురిజాల పొయ్యాడు. వాళ్ళూ తగిన విధంగా గౌరవించారు. గురిజాలలో నాయకురాలు ఆయనకి విషం పెట్టించింది కానీ ఆమె ప్రయత్నం నిష్ఫలం అయ్యింది.

Thursday, May 14, 2009

పల్నాటి వీర చరిత్ర - 1

బాలమాచాపురం అ.క.అ జంభాపురి అని ఒక ఊరు. అనుగురాజు అనేఆయన దీనికి రాజు. ఇతను, కార్తవీర్యార్జునుడికి ఏడోతరం వాడు. కార్తవీర్యుడు చేసినపాపాలు బాధింపగా అనుగురాజు బ్రాహ్మణోత్తములు ఆలోచించి ఇలా చెప్పారు, జీడినూనె గుడ్డలేస్కుని సైన్యాన్ని, పరివారాన్ని, సిరిసంపదల్ని అన్నీ వదిలేసి, రాజ్యాన్ని వదిలేసి తీర్ధయాత్రలకు వెళ్ళి పుణ్యక్షేత్రాలు దర్శించుకోమని సూచిస్తారు.
అనుగురాజు నానా క్షేత్రాలు దర్శించుకుంటూ పలు నదుల్లో మునుగుతూ, కృష్ణానదిలో స్నానం చేస్తుండగా, నల్లని జీడిగుడ్డలు తెల్లగా అయినయి. బ్రాహ్మణోత్తములు సూచనలో ఇది చెప్తారు, బట్ట తెలబడితే పాపవిమోచనం ఐనట్టు అని. అనుగురాజు చందవోలు అ.క.అ చందోలు రాజకుమార్తెను పెళ్ళిజేస్కున్నడు. ఆమెపేరు మైలాంబ. కూతురుకి చందవోలు రాజు పల్నాడుని అరణం గా ఇచ్చాడు. ఆమెపేరు మైలాంబ. అనుగురాజు, గురిజాల అ.క.అ గురజాలని రాజధానిగా చేస్కుని పల్నాటికి రాజయ్యాడు. అనుగురాజుకి మొత్తం ముగ్గురు భార్యలు. వీరవిద్యాదేవి, భూరమాదేవి, మైలమాదేవి.
వీరవిద్యాదేవికి ముగ్గురు కొడుకులు పెద్దమల్లదేవుడు, పినమల్లదేవుడు, బాలమల్లదేవుడు.
భూరమాదేవికి నలుగురు కొడుకులు కామరాజు, నరసింహభూపతి, ఝట్టిరాజు, పెరుమాళ్ళురాజు.
మైలమా దేవి కుమారులు నలగామరాజు, నరసింగరాజు.
అనుగురాజు మంత్రి దొడ్డనాయుఁడు. ఇతను వెలమ, జేతినాయుని కుమారుఁడు.
దొడ్డనాయని కొడుకులు - బాదరాజు, బ్రహ్మనాయుఁడు.
బాదరాజుకు ఇంకోపేరు పెద్దన్న.
పిల్లలు పుట్టకముందు, అనుగురాజు పెద్దన్నని పెంచుకున్నాడు. పెద్దన్న కంచర్ల రాజకుమారి లవాంబ ని పెళ్ళిజేస్కున్నాడు.
బ్రహ్మనాయుఁడిని విష్ణువుగా భావిస్తారు. కురుక్షేత్రయుద్ధానికి కృష్ణుడెంత ముఖ్యుడో పల్నాటి యుద్ధానికి బ్రహ్మనాయుడు అంతే ముఖ్యుడు. ఈయన్ని పల్నాటి కృష్ణుడిగా బావిస్తారు. బ్రహ్మనాయుఁడి కుమారులు బాలచంద్రుఁడు, మరియూ కన్నమదాసు.

Wednesday, May 13, 2009

బాలచంద్రుడి యుద్ధంలో పాలుపంచుకున్నవారు

అనుగురాజు
అన్నమ్మ
అలరాజు
ఐతాంబ
కన్నమదాసు
కుమ్మరాజు
గండుకన్నమనీఁడు
తెప్పలినాయుఁడు
నలగామరాజు
నరసింగరాజు
నాయకురాలు నాగమ్మ
పినమలి దేవరాజు
మెమ్మసాని
బాలమలిదేవుఁడు
బాదన్న
బాలచంద్రుఁడు
బ్రహ్మనాయుఁడు
మలిదేవరాజు
మాంచాల
మాడచి
రేఖాంబ
వెంకు
శీలాంబ
శ్యామంగి

అనపోతు
వెలమలదోర్నీఁడు
చాకల చందు
మంగలమల్లు
కమ్మరపట్టి
కుమ్మరపట్టి
కంసాలచందు

కొండమన్నెమరాజు
కోటకేతుఁడు
మాడుగుల వీరారెడ్డి
చింతపల్లిరెడ్డి

ఆవాలనాయుఁడు
సుంకరరాముఁడు
చెవులనాయకులు
జంగిలినాయకులు
పెనుమాలవారు
సంపెటనాగన్న

వెలమనాయుఁడు
మలినీఁడు
పినమలినీఁడు
గోపినాయుఁడు