Thursday, May 14, 2009

పల్నాటి వీర చరిత్ర - 1

బాలమాచాపురం అ.క.అ జంభాపురి అని ఒక ఊరు. అనుగురాజు అనేఆయన దీనికి రాజు. ఇతను, కార్తవీర్యార్జునుడికి ఏడోతరం వాడు. కార్తవీర్యుడు చేసినపాపాలు బాధింపగా అనుగురాజు బ్రాహ్మణోత్తములు ఆలోచించి ఇలా చెప్పారు, జీడినూనె గుడ్డలేస్కుని సైన్యాన్ని, పరివారాన్ని, సిరిసంపదల్ని అన్నీ వదిలేసి, రాజ్యాన్ని వదిలేసి తీర్ధయాత్రలకు వెళ్ళి పుణ్యక్షేత్రాలు దర్శించుకోమని సూచిస్తారు.
అనుగురాజు నానా క్షేత్రాలు దర్శించుకుంటూ పలు నదుల్లో మునుగుతూ, కృష్ణానదిలో స్నానం చేస్తుండగా, నల్లని జీడిగుడ్డలు తెల్లగా అయినయి. బ్రాహ్మణోత్తములు సూచనలో ఇది చెప్తారు, బట్ట తెలబడితే పాపవిమోచనం ఐనట్టు అని. అనుగురాజు చందవోలు అ.క.అ చందోలు రాజకుమార్తెను పెళ్ళిజేస్కున్నడు. ఆమెపేరు మైలాంబ. కూతురుకి చందవోలు రాజు పల్నాడుని అరణం గా ఇచ్చాడు. ఆమెపేరు మైలాంబ. అనుగురాజు, గురిజాల అ.క.అ గురజాలని రాజధానిగా చేస్కుని పల్నాటికి రాజయ్యాడు. అనుగురాజుకి మొత్తం ముగ్గురు భార్యలు. వీరవిద్యాదేవి, భూరమాదేవి, మైలమాదేవి.
వీరవిద్యాదేవికి ముగ్గురు కొడుకులు పెద్దమల్లదేవుడు, పినమల్లదేవుడు, బాలమల్లదేవుడు.
భూరమాదేవికి నలుగురు కొడుకులు కామరాజు, నరసింహభూపతి, ఝట్టిరాజు, పెరుమాళ్ళురాజు.
మైలమా దేవి కుమారులు నలగామరాజు, నరసింగరాజు.
అనుగురాజు మంత్రి దొడ్డనాయుఁడు. ఇతను వెలమ, జేతినాయుని కుమారుఁడు.
దొడ్డనాయని కొడుకులు - బాదరాజు, బ్రహ్మనాయుఁడు.
బాదరాజుకు ఇంకోపేరు పెద్దన్న.
పిల్లలు పుట్టకముందు, అనుగురాజు పెద్దన్నని పెంచుకున్నాడు. పెద్దన్న కంచర్ల రాజకుమారి లవాంబ ని పెళ్ళిజేస్కున్నాడు.
బ్రహ్మనాయుఁడిని విష్ణువుగా భావిస్తారు. కురుక్షేత్రయుద్ధానికి కృష్ణుడెంత ముఖ్యుడో పల్నాటి యుద్ధానికి బ్రహ్మనాయుడు అంతే ముఖ్యుడు. ఈయన్ని పల్నాటి కృష్ణుడిగా బావిస్తారు. బ్రహ్మనాయుఁడి కుమారులు బాలచంద్రుఁడు, మరియూ కన్నమదాసు.

4 comments:

  1. brahamanaayudi kumaarulu amte dattu teesukunna vaaru 18 mamdi amtaaru kadaa? kannamadaasu maalakulkam numchi dattuteesukobadi peddakumaarunigaa pemchabaddaadu kadaa brahamanaayuniki

    ReplyDelete
  2. భాస్కర్ గారు,
    మంచి ప్రయత్నము. కొనసాగించండి. మాలాంటివారికి తెలియని విషయాలు తెలుసుకోవటానికి వీలుగా ఉంటుంది.

    ReplyDelete
  3. బావుందండీ మీ ప్రయత్నం . పల్నాటి బ్రహ్మ నాయుడు చూశాననుకోండి .ఆ సినిమాలో ఇయన్నీ చెప్పనేలేదండీ ....ఒక వీలవేస్తే ...అధ్బుతాలు జరిగిపోతుంటాయిగానీ .... :) :)

    ReplyDelete
  4. అదేమరి కామెడీ అంటే. పల్నాటి బ్లాగులో బాలకౄష్ణ కథ మేమొప్పుకోము. అందుకే సినిమా ఫట్ మంది.

    ReplyDelete