Friday, May 22, 2009

పల్నాటి వీర చరిత్ర - 2

కన్నమదాసు - బ్రహ్మనాయుఁడి వరంవల్ల బెమ్మసానికిఁ పుట్టినవాడు. కావున ఇతనూ, బహ్మనాయుఁడి కుమారుడిగానే ప్రసిద్ధి.
దొడ్డనాయుఁడు మంత్రిగా, అనుగురాజు కొంతకాలం పరిపాలించి కాలధర్మం చేసాడు. దొడ్డనాయుఁడు కూడా కాలం చేసాడు.
నలగామరాజు పట్టాభిషిక్తుడయ్యాడు. నాయకురాలు అను ఒక యువతి, నిజశక్తిచేత అనుగురాజు అనుగ్రహం సంపాదించింది. అనుగురాజు చనిపోయినాక, నలగామరాజువద్ద మంత్రిణి అయ్యింది. ఈ నాయకురాలి అసలుపేరు నాగాంబ. నాయకురాలిగా ప్రసిద్ధి.
నాయకురాలి నాగాంబ జన్మస్థలం పల్నాడుతాలూకాలో నాగులేటిఒడ్డున ఉన్న చిట్టిగామాలపాడు అనే ఒక చిన్నగ్రామం. ఈమె రెడ్లకులములో పుట్టింది. తండ్రిపేరు ఛౌదరిరామిరెడ్డి. ఈమె మేనమామ పేరు మేకపోతు సింగారెడ్డి. ఈమె యింటిపేరు రవల్లివారు అనిచెప్పఁబడింది. ఇది తల్లిగారి ఇంటిపేరో మరి అత్తగారి ఇంటిపేరో తెలియదు.ఈమె భర్త పేరు ఎక్కడా లేదు.
పల్నాటి యుద్ధానికి ఈమే కారణం.
గురిజాల పురాధీశులు నలగామరాజు ఈమె చేతిలో కీలుబొమ్మ.
ఈమె బ్రహ్మనాయుఁనికి పోటీగా రాజ్యతంత్రం నడిపిన మహా సమర్ధురాలు.
యుద్ధం చివరివరకూ అశ్వారూఢయై బ్రహ్మనాయునితో పోరాడిన సమర్ధురాలు.
[నాగమ్మ గురించిన ఒక చిన్న వ్యాసం - సాక్షి దినపత్రికలో ఇక్కడ చూడండి http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=133998&subcatid=17&categoryid=3]

నాయకురాలు నాగాంబ మంత్రిణి అయ్యేప్పటికి వీరవిద్యాదేవికి పుట్టిన మల్లదేవాదులు పిల్లలు. బ్రహ్మనాయుఁడు వీరిని దగ్గఱకుఁ తీసి రాజ్యంలోఁ కొంతభాగం ఇప్పించి, గురిజాలనుండి పోయి మాచెర్ల పట్టణం నిర్మించుకొని వారిది యుక్తవయస్సుకానందున, వారికిఁ బదులుగా తనే పరిపాలిస్తూ, వాళ్ళకి యుక్తవయస్సు రాంగనే కళ్యాణ పట్టణాధీశుఁడైన వీరసోముని కుమార్తెనిప్పించి పెదమల్లదేవునికి పెళ్ళిజేసి మాచెర్లకు పట్టాభిషికేం చేసాడు.
అనుగురాజు చనిపోవునప్పుడు కొడుకులందర్నీ బ్రహ్మనాయుఁడికి ఒప్పగించాడు. నలగామరాజు నాయకురాలిని మంత్రిణిగాఁ జేస్కున్నా మల్లదేవులకుఁ పెళ్ళి చేసిన తర్వత బ్రహ్మనాయుఁడు ద్వేషబుద్ధిలేకుండా నలగామరాజుకు భూరమాదేవి పుత్రులకుఁ కట్నం ఇవ్వటానికి గురిజాల పొయ్యాడు. వాళ్ళూ తగిన విధంగా గౌరవించారు. గురిజాలలో నాయకురాలు ఆయనకి విషం పెట్టించింది కానీ ఆమె ప్రయత్నం నిష్ఫలం అయ్యింది.

11 comments:

  1. మంచి వివరాలు రాస్తున్నారు. అయితే నాకో సందేహం. ఇది చరిత్రలా రాస్తున్నారా, ఓ పురాణంలా రాస్తున్నారా? 'వరం వల్ల పుట్టటం' వంటి వాక్యాలు చదివి ఆ అనుమానం వచ్చింది. లేకపోతే - మరోరకంగా చెబితే అసభ్యంగా ఉంటుందని వరం అన్నారా?

    ఇంకోటి.

    >> "గురిజాలనుండి పోయి మాచెర్ల పట్టణం నిర్మించుకొని"

    నాకు తెలిసిన ప్రకారం, బ్రహ్మనాయుడికి ముందే మాచెర్ల (మహదేవ చర్ల) ఉంది. హైహయ రాజుల హయాములో చెన్నకేశవాలయం నిర్మించబడింది.

    ReplyDelete
  2. సార్!!
    ధన్యవాదాలు నా బ్లాగ్ కి విచ్చేసినందుకు.
    దీన్ని చరిత్రలానే రాస్తున్నా. కారణం - పల్నాటి చరిత్ర, చరిత్రే కనుక.
    వరం అనుకోవచ్చుగా??

    మాచర్ల - ఏమో అంతకముందే ఉండి ఉండవచ్చు. ఇంకో విషయం, కొన్ని కొన్ని ఊళ్ళు అటు ఇటు జరిగనై. కొన్ని పునర్నిర్మితం అయ్యిఉండవచ్చు. ఉదా।। గామాలపాడు. ఇప్పుడున్న గామాలపాడు పల్నాటి యుద్ధం జరిగినప్పటి గామాలపాడు కాదు. అప్పటి గామాలపాడు యుద్ధం తర్వాత పూర్తిగా నాశనం అయ్యింది. అలానే గామాలపాడు కోట. అక్కడ ఒక కోట ఉండేగని అని ఎంతమందికి తెలుసూ?

    ReplyDelete
  3. మాది పక్క వూరే కాబట్టి గామాలపాడు కోట వుందని నాకు తెలుసు......గామాలపాడు నుండి...నాగులేరు వైపు వెళ్తే శిధిలాలు కనిపిస్తాయని అంటారు కానీ ఎప్పుడు వెళ్ళలేదు....!

    ReplyDelete
  4. నేను పుట్టింది కారెంపూడి మండలం....మా ఆవిడది మాచెర్ల మండలం.........! కానీ నా దురదృష్టం ...ఇప్పటివరకు కారెంపూడి లో జరిగే పల్నాటి వీరుల ఉత్సవాలు చూడలేదు......!

    ReplyDelete
  5. చూడండి భాస్కర్ గారు, వయసులొ పెద్ద వాళ్ళు కాబట్టి బతికి పోయారు. లేకుంటేనా.

    కొంచెం కూడా లౌక్యం తెలీదు మీకు! కారణ జన్ముడు, "ఒకేఒక్కడు" దేవుడు యేసయ్య కన్య అయిన మర్యమునకు దైవాంశతో జనియించెను. ఇదీ చరిత్ర చెప్పు పద్ధతి. ఇది మీరితిరా, మరియొక దేవుని గొలుచు జనులందరూ యేసు సైనికుల దృష్టిలో యెటుల ఆటవికులుగా కొలువబడుదురో, మరియొక రీతిన చెప్పెడి చరిత్ర చూసిన మాకు యేవగింపు గలుగును. ఇది తెలుసుకుని ప్రవర్తించుడి!

    ReplyDelete
  6. రామరాజు,

    తర్వాతి భాగం ఎప్పుడు రాస్తున్నారు? ఇది తెవికీలో కూడా పెడితే బాగుంటుందేమో చూడండి. అందులో పల్నాడు గురించి కొంత సమాచారం ఉంది కానీ అంత వివరంగా లేదు.

    ReplyDelete
  7. రామరాజు గారు తెవికీలో పెడితే పెట్టారు.. కానీ మా వెర్షను చరిత్ర వ్రాయుడి. జాగర్త

    హామెన్!!

    ReplyDelete
  8. అబ్రకదబ్ర - రాస్తున్నా బ్రదర్. టైం దొరికినప్పుడల్లా ఓ వాక్యం బెరుకుతున్నా.

    యోగయ్యా - నేను అందరివాణ్ణి. [కొ.ని, ముత్తయ్య 6:78:97]

    ReplyDelete
  9. [కొ.ని, ముత్తయ్య 6:78:97] ROFL!!

    అసలు నేను అఠుల వ్రాయవలసినది, మీరు రాసితిరి. ఇక లాభము లేదు, నేను నూట తొమ్మిదవసారి మారుమనస్సు బొందవలె, ప్రతి ఉదయమూ తెలుగు ఛానెళ్ళందు సువార్త శ్రద్ధగా వినవలె. సెలవు

    ReplyDelete