Wednesday, June 3, 2009

పల్నాటి వీర చరిత్ర - 3

నాయకురాలు బ్రహ్మనాయుఁణ్ణి రెచ్చగొట్టి కోడిపందేలకు తెరతీస్తుంది. ఓడిపోయినోళ్ళు ఏడు సమచ్చరలు రాజ్యంఇడిచిబెట్టి ఇతరప్రాంతాలకు ఎళ్ళాలి అనేది పందెం. పందెంలో బ్రహ్మనాయుఁడు ఓడిపొయ్యి, మాచర్లని ఇడిసిపెట్టి, ఏడేళ్ళు మండాది అడవులకు ఎళ్ళాలని నిర్ణయించాడు. బ్రహ్మనాయుఁడు ఈ విషయాన్ని మలిదేవరాజుకు, మాచర్ల కాపులకు, కరణాలకు చెప్పాడు. కాపులు మలిదేవరాజు పాలనకింద అన్ని సౌఖ్యాలు అనుభవిస్తున్నాం, నలగామరాజు మంత్రిణి నాయకురాలికి, మమ్మల్ని ఒప్పగించి పోవాలనుకుంటున్నారు, పంపకాల్లో, పంటల్లో, పన్నుల్లో, కొలతూముల్లో ఆమె మమ్మల్ని వేధిస్తుంది, మేమిక్కడ ఉండలేము. మీవెంట మేమూ అడవులకి వస్తాం, అడవుల్నైనా దున్నుఁతాం కానీ, నాయకురాలికింద బతకలేము అనిచెప్తారు.
మాటతప్పి బ్రహ్మనాయుఁడు కాపులను ఎంటదీస్కెళ్ళాడు, ఊళ్ళన్నీపాడుబెట్టాడు అని శత్రువులు అనుకుంటారు, మాటొచ్చుద్ది. మీరు ఈణ్ణే ఉండండీ అంటాడు బ్రహ్మనాయుడు. కానీ ప్రజలు ఇనలేదు. సరే కానిమ్మని ఒప్పుకున్నాడు బ్రహ్మనాయుడు. అందరూ బయల్దేరండి అని ఊళ్ళో చాటింపేసారు.
వీరులని ఎంటబెట్టుకుని బ్రహ్మనాయుఁడు చెన్నకేశవుని గుడికెళ్తాడు. చెన్నుడి ఆభరణాలన్నీ ఓ పెట్టెలో పెట్టారు. ఆయన్ని కొల్చుకున్నారు. చివరిమొక్కు మొక్కారు. తక్కిన దేవతలకీ మొక్కారు. భైరవునికి భుక్తిపెట్టారు. తిరిగి ఇళ్ళకి వచ్చారు. సరుకులు బండ్లకెత్తుకున్నారు. అందలాలు, గుడారాలు, పల్లకీలు, సిద్ధం చేస్కున్నారు. మాచర్లనుండి బయల్దేరాల్సిన ఆదివారం వచ్చింది. వీరమాతలు, వీరపత్నులు, రాణులు, అందలాల్లో ఎక్కారు. వీరులు, రాజులు గుఱ్ఱాలెక్కారు. సైన్యం కదిలింది. పశువులు కదిలినై. గండికోఁట దాటారు. నాగార్జునకొండ దగ్గరకి వచ్చారు.

12 comments:

  1. చెన్నకేశవుడు, ధర్మం, నీతి నిజాయితీ, బ్రహ్మనాయుడు, మాచర్ల, బాలచంద్రుడు, శౌర్యం, విలువలు, వరాలు, సహపంక్తి భోజనాలు, ఆ గొప్పదనం... పేర్లు వింటేనే ఏదో గౌరవభావం కల్గించింది మన యంటీఆర్ నటించిన సినెమాలూ, మీలాంటి నిజాయితీ లేని చరిత్ర కారులే(లేకుంటే ఎంత ధైర్యమ్ లేకుంటే మీరు "వరం వల్ల" అని రాస్తారు? మేమేం ఇంగ్లీషు మీడియా సదవలేదనుకుంటున్నారా? ఏదీ "వరం" చూపించు నాకు, నమ్ముతా)

    యంటీఆర్ అసాధారణ ప్రతిభతో రక్తి కట్టించుటవల్లనే "పల్నాడు" అనేది ఒకటుందని అందరికీ తెల్సింది. అసలు సినెమాలే లేకపోతే తెలు-గోళ్లకు చరిత్రేలేదు. చరిత్ర ఉంటే గింటే పెపంచ చెరిత్ర ఒకేఒక్కడు దేవుడిది.. మిగతా అంతా ఆటవికం

    అసలు Pavloavian Conditioning ప్రకారం అద్వైతం అంటే మనుషుల్లో ఉండే అభత్రదాభావాల్ని బ్రాహ్మణులు క్యాష్ చేసుకునేందుకు కనుగొన్న Diffusion of Responsibility మరియూ Norephinephrine కలగలిపిన ఒక Dissociation from reality మాత్రమే! మీలాంటి వాళ్ళు దీన్ని గుడ్డిగా నమ్మి మీ మీ బ్లాగుల్లో రాసుకున్నా ఎవరూ పెద్దగా అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ మా రంగనాయకమ్మ బ్రాండు మేతావులు దీన్ని Pathologize చేసి Predisposing factors ని ఎలా కనుగొనాలో చెప్పియున్నారు. ఇలాంటి వారి Schema గురించి మాకెంత తెలిసినా, అలాంటివాళ్ళే మళ్ళీ మమ్మల్ని ప్రశ్నించడం మీ కుత్సితాన్ని తెలియజేస్తోంది. enjoy your ignorance. Self-Fulfilling Prophecy లో బ్రతికినంతకాలం మీలాంట వాళ్ళను ఏమీ చెయ్యలేం.. మా అసమదీయుల బ్లాగుల్లో భజనలు తక్క.

    ReplyDelete
  2. మాచెర్ల దగ్గర్లోనూ గండికోట ఉండేదా? కడప జిల్లాలో ఒకటి ఉంది ఇప్పటిక్కూడా.

    ReplyDelete
  3. అబ్రకదబ్ర
    మండాది గ్రామం ఎక్కడ ఉందీ? ఏటికటపా ఇటైపా? చాలా చోట్ల, బ్రహ్మనాయుఁడు తన పరివారంతో ఏరుదాటి మండాదిబొయ్యాడు అనిఉంది. కానీ మండాది అనేది వెల్దుర్తి మండలంలో ఉంది.
    ఏమో. బ్రాహ్మణపల్లులు ప్రతీ పదిహేను గ్రామాల్లో ఒకటి. పిడ్రాళ్ళా దాస్పల్లి మధ్యన ఒకటుందా? బెల్లంకొండ రెడ్డిగూడెం మధ్య ఒకటుంది. కామేపల్లులు పల్నాడులో రెండున్నాయి అనుకుంటా.

    ReplyDelete
  4. ఏవయ్యా యోగి.
    అస్సలేమనుకుంటన్నా. తెలు-గోళ్ళు ఏందీ అంటా. నాయాల్ది, తెల్గు-గోళ్ళు, కాలి-గోళ్ళు.
    అస్సలు యంటీఆర్ గురించి రాసావంటె, తస్సదియ్యా, నిన్ను కుమ్మటమే.
    ఎవుడిదయ్యా ఇగ్నోరెన్సు? బెమ్మనాయుఁడిదా? నాగార్జునుడిదా? సాగర్ మాతదా? లేక పల్నాటి పెజలదా? లేక ఆడబుట్టిన నాదా?
    "నీరు పల్లంవైపు ప్రవహించును. నీలో రక్తం ప్రవహించును. నీలో రక్తం పల్లం వైపుకే ప్రవహించును. అనగా కాళ్ళవైపుకే ప్రవహించును. కావున కాలుమీద కాలువేసుకొనుడి" - కొ.ని; పేతురు 3:5:78

    ReplyDelete
  5. మండాది ఇప్పటికీ మాచర్ల నుండి నడక దూరంలోనే ఉంది - ఐదారు కిలో మీటర్లు. ఏరు దాటటం సంగతి నాకు తెలీదు. అప్పట్లో ఈ రెండు ఊర్లకీ మధ్య ఏర్లేమైనా ఉండేవేమో మరి, ఇప్పుడైతే ఏమీ లేవు.

    ReplyDelete
  6. అన్నో రూంత చెరిత్ర వొదుల్తా కాస్కో, చెరిత్రంటే ఇలాగుండాలె:

    "దేవునిలో తండ్రి, కుమార (యేసు), పరిశుద్ధాత్మ అనే ముగ్గురు వ్యక్తులు ఏకమై త్రిత్వము గా ఉన్నారనే క్రైస్తవ సిద్ధాంతము. తండ్రి అంటే యెహోవా కుమారుడు అంటే ఏసు క్రీస్తు పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మ-త్రిత్వం అంటే ఈ ముగ్గురూ విడి విడి వ్యక్తులే కానీ ఒక్కరే. ఈ త్రిత్వం అర్ధం కాదు కానీ నమ్మాలి. అర్ధం చేసుకోటానికి ప్రయత్నిస్తే మైండు పోతుంది నమ్మకపోతే ఆత్మే పోతుంది అని ఒక మిషనరీ అన్నారు."

    http://te.wikipedia.org/wiki/త్రిత్వము

    ReplyDelete
  7. నాయనా! త్మ ఆత్మ పరమాత్మ మగ్గులో ముంచిన మూడు బ్రెడ్డు ముక్కల్లాంటివి" [పా.ని: రూబేను5:3:23]

    ReplyDelete
  8. వచ్చిన, సదివిన, ఏం సెప్పాలో ... అయ్యబాబోయ్ ఆ మాండలీకం నా వల్ల కాదండి. మీ చరిత్రలోని చాలా వ్యక్తులు, ప్రదేశాలు, యోగి గారు, రంగనాయకమ్మ [ఆవిడతో కలిసి కూర్చుని దోశ తిన్నాను, గడిచిన కాలంలో అత్యంత ఆత్మీయ బంధం ఆమెకు మా కుటుంబంతో] గారు గుర్తుకొస్తున్నారు. ఈ చరిత్ర చదివిందే అయినా కొంచం బొబ్బిలి యుద్ధం మాదిరే ఇది కూడా ఉద్రేకం, ఉత్కంఠ కలిగిస్తది. మా కిట్నమ్మ వూసే లేదే? నాగార్జున కొండ ఎన్ని మార్లు ఎక్కి దిగానో, నాగార్జునాచార్య పాత్రని అన్ని సార్లు అభినయించాను నృత్యనాటికల్లో.వచ్చిన, సదివిన, ఏం సెప్పాలో ... అయ్యబాబోయ్ ఆ మాండలీకం నా వల్ల కాదండి. మీ చరిత్రలోని చాలా వ్యక్తులు, ప్రదేశాలు, యోగి గారు, రంగనాయకమ్మ [ఆవిడతో కలిసి కూర్చుని దోశ తిన్నాను, గడిచిన కాలంలో అత్యంత ఆత్మీయ బంధం ఆమెకు మా కుటుంబంతో] గారు గుర్తుకొస్తున్నారు. ఈ చరిత్ర చదివిందే అయినా కొంచం బొబ్బిలి యుద్ధం మాదిరే ఇది కూడా ఉద్రేకం, ఉత్కంఠ కలిగిస్తది. మా కిట్నమ్మ వూసే లేదే? నాగార్జున కొండ ఎన్ని మార్లు ఎక్కి దిగానో, నాగార్జునాచార్య పాత్రని అన్ని సార్లు అభినయించాను నృత్యనాటికల్లో.

    ReplyDelete
  9. ఒచ్చుద్ది ఒచ్చుద్ది. ముందుగాల. కిట్నమ్మ లేకుండ పల్నాడేడుంది? సదువుతా ఉండండి. రాబోయే పోష్టులో కిట్నమ్మ ఉందిలె.

    ReplyDelete
  10. పల్నాటి కథ తెలుసకుంటుంటే .. నాయుడ్లు, వెలమవాళ్లు, మాలవాళ్లు అందరూ ఒకే వర్గానకి చెందినవారిలాగే ఉన్నారు. వీరి కథే పల్నాటి కథ అనిపిస్తోంది నిజమేనా...ఇంకా వివరంగా చెప్పడీ...

    ReplyDelete
  11. పల్నాటి కథంతా మలవాళ్లు, వెలమాల వాళ్లు, నాయుడ్లు అందరూ ఒకే వర్గానికే చెందిన వాళ్లు అనిపిస్తోంది. నిజమేనా...

    ReplyDelete