Wednesday, June 10, 2009

పల్నాటి వీర చరిత్ర - 4

నాగార్జున కొండకాడికి వచ్చిన మందీ మార్బలం అందరూ అక్కడి మంత్రవాదుల మహిమలు, పులుల భయంకరమైన కధలు బ్రహ్మనాయుఁనికి జనాలు వివరించారు.

చుక్కలగుండం దాఁటి, కళ్ళకుంటదాఁటి పెందోట కి వచ్చారు అంతా. అక్కడి అడవిని దాట్టం ఎట్లా అని అందరు గజగజ వణికుతూ ముందుకి కదిలారు. ఓ పెద్దపులి ఆ గుంపులోకి రానే వచ్చింది. గుంపులో కలకలం మొదలైంది. ఎద్దులు, ఆవులు బెదిరి చెల్లాచెదురైనై. నలగామరాజు సైన్యం వచ్చిందని బ్రహ్మనాయఁడు అనుకున్నాడు. చివరకు పులి అని తెల్సుకున్నాడు. లంకన్న, గండుకన్నమనీడు, పులిమీదఁపడి చంపారు. అలా ప్రయాణం జేసిన జనాలు, చివరకు ఏలేశ్వరం వద్దకు వచ్చారు. ఏలేశ్వరంవద్ద కృష్ణానదిని దాఁటి వలస అడవులకి వెళ్ళాలి. రాణులు, దాసదాసీజనం, పుట్లెక్కి కృష్ణదాఁటారు. సైన్యం దాఁటిది. పశువులు ఈదికుంటూ అద్దరి చేరినై.రాజులెక్కిన పుట్లు బయల్దేఱినై. మొసలి ఒకటి ఎదురొచ్చింది. ఎఱ్ఱటి కళ్ళతో, మొగలిపువ్వంటి ముక్కుచాయ, మిసిమి వాడికోరలు, ఒడ్డురాళ్ల వంటి ఒడలి చిప్పలు, అది ఎంతో భయంకరంగా ఉంది. నాయకురాలి కుట్రతో మంత్రవాదులు చేసిన పంపు అనుకున్నారు జనాలు. వీరులు దాన్ని పొడిచారు. అది నదినంతా అల్లకల్లోలం చేస్తూ మలిదేవరాజు పుట్టి మీదకు పోతున్నది. బ్రహ్మనాయఁడు ఉగ్రుఁడై మొసలికి అడ్డం వెళ్ళాడు; సుడిగుండాలన్నింట్లో దాన్ని తిప్పి ముప్పతిప్పలఁబెట్టాడు. ఇంతలో రాజుల పుట్లు అద్దరి జేరుకున్నై. బ్రహ్మన్న పోరాడుతున్నాఁడు.

మొసలిజవం తగ్గట్లా. బ్రహ్మనాయఁడు నీటిలోమునిఁగాడు. మొసలిదెబ్బకు చచ్చి బ్రహ్మనాయుఁడు నీటమునిఁగెనని రాజులు, దొరలు, వీరులు దుఃఖపడ్డారు. బ్రహ్మనాయుఁడి శరీరాన్ని వెతుక్కుని రమ్మని బెస్తలని పంపించారు. వారు మునిఁగి అంతటా చూసారు, ఎక్కడా బ్రహ్మనాయుఁడి జాడె లేదు. ఆశలు వదులుకుని బయటకి వచ్చారు బెస్తలు. రాజులకి విన్నవించుకున్నారు దొరకలేదని. అందరి దుఃఖం అధికమైంది. ఇంతలో బ్రహ్మనాయుని తల్లి శీలమ్మ, రాజులవద్దకు వచ్చింది.

"మీరు ఎంతమాత్రమూ చింతించొద్దు. చుక్కలు రాలితే, చూర్యుడు పడమటపొడిస్తే, సముద్రం ఇంకితే, బ్రహ్మనాయుఁడు చచ్చెను అనుకోవాలి. బ్రహ్మనాయఁడు మొసలిచేత చచ్చువాఁడు కాఁడు. నాకుమారుని మనుష్యుఁడు చంపలేడు. మృగము చంపలేదు. జాతకం చూసినా బ్రహ్మన్న కు ఇప్పుడు చావులేదు. నాకుమారుఁడు వీరుఁడు మొసలిని చంపునుగానీ, మొసలి నా కుమారుఁదిని చంపలేదు" అని చెప్పింది శీలమ్మ.

ఇంతలో బ్రహ్మనాయఁడు నీటిపైకి వచ్చాడు. మొసలిదవడలను కాలితోతన్నినాఁడు, కాళ్లను నడుమును నరికినాఁడు. నదీ ప్రవాహం మొసలి రక్తంతో ఎఱ్ఱబడింది. మొసలి గిలగిల్లాడి ప్రణాలు విడిచింది. బ్రహ్మనాయఁడు పోయి ఒక గుంటిమీద నిలబడ్డాడు. అప్పటినుండి అది నాయనిగుండు అని ప్రసిద్ధికెక్కింది. రాజులు, దొరలు, జనలు, సైన్యం అందరూ సంతోసించారు. మలిదేవరాజు వెంటనే కొలువుజేసి, బ్రహ్మనాయఁన్ని సభలో గౌరవించాడు. మళ్ళీ జనాలు అంతా బయల్దేరి మండాది అడవులకు జేరి విడిదిజేసారు. మేడలు, ఇళ్ళు, కట్టుకున్నారు. రాజుల కులువుకూటములు తీరి దొరల మొగసాలలు ముగిసినై. గోపురాలు లేచినై. వీధులేర్పడ్డై. అంగళ్ళు వెలిసినై. మండాది ఒక పెద్ద పట్టణం అయ్యింది.

[ఇప్పటికీ పల్నాడులోని కొన్ని ప్రంతాల్లో చిరుతపులు ఉన్నాయి. ఇక రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ అనే ప్రాజెక్ట్ టైగర్ నాగార్జున సాగర్ నుండి మొదలై శ్రీశైలం వరకూ వ్యాపించి ఉంది. ఏసియాలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఇది అని ఎవరో చెప్పగా విన్నా. ఇప్పటికీ అనగా 1999 వరకూ నాకుతెలిసి, రాత్రిళ్ళు బస్సుల్ని ఆపేసేవారు శ్రీశైలం అడవుల్లోకి వెళ్ళకుండా. దోర్నాల దగ్గర ఆపేస్తారు అనుకుంటా. నాకో కధ చూఛాయగా గుర్తు. మా చిన్నప్పుడు మానాయన జెప్తుండేవాడు. అప్పట్లో పొందుగల లో మానాయనా వాళ్ళు ఉండేవాల్లట. ఓ రోజు ఓ చిరుతపులి ఒకళ్ళింట్లోకి దూరింది. ఆ సమయానికి ఇంట్లో ఎవుళ్ళూ లేరు. జనం గుమిగూడారు. శతవిధాలా ప్రయత్నించినా అది బయటకి రాలేదు. అప్పుడు ఓ పోలీసు జవాను వచ్చి దాన్ని కాల్చేసాడని మా నాయన ఉవాచ]

[కృష్ణానది మొసళ్ళకి పేరు. అన్నీచోట్ల ఉంటాయని కాదు. శ్రీశైలం దగ్గర్నుండి సాగర్ దాకా, సాగర్ దాటినాక కూడా ఉండేవి. తర్వాత జనావాసాలు ఎక్కువవ్వటంవల్ల కుచించుకుపోయి కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయి. పొందుగుల దాటినాక, కృష్ణ మూసీ నది కలిసే చూటు దాటంగనే వచ్చే గుండ్రాళ్ళ కయ్యల్లో ఉండేవని చెప్పుకుంటారు.]

[కృష్ణానది చాలా విచిత్రమైన నది. పోను పోనూ(సముద్రానికి వైపుకి) నది ఫ్లాట్ గా ఉంది (బెజవాడ నుంచి కిందకి) కాని, సాగర్ వద్దనుండీ చూస్తే ఎన్నో మలుపులు. అలానే ఆ నది అడుగు ఎంతలోతు అని చెప్పలేరు. కారణం, శ్రీశైలం దగ్గర్నుండీ రాళ్ళ గుట్టలే ఆ రాళ్ళల్లోంచి ప్రవహిస్తుందీ నది. కాబట్టి ఇక్కడ ఒక అడుగు లోతుంటే అడుగుతీసి అడుగేస్తే అరవై అడుగుల లోతుంటుంది. అందుకే సుడిగుండాలు చాలా ఎక్కువ. ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే ఇసుక మేట. అన్నీ చోట్ల ఉండదు. అచ్చంపేట నుండి ఇక కిందకి చేరుకునేసరికి ఇసుక మేట అధికమౌతుంది.]

19 comments:

 1. అన్నా నేనూ పల్నాటోణ్ణే. తాత ముత్తాతల్ది పల్నాడే. ఇంటిపేరే కారంపూడి. కాకపోతే పుట్టిందీ, కాస్త వయసొచ్చేదాకా పెరిగిందీ పెదకూరపాడు. మీరు చాలా బాగా రాస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది.

  కాపోతే ఒకటే డబుటు. "పీల్చింది పల్నాటి గాలి"

  LOL. LOL. LOL.

  పల్నాటి గాలీ వెస్టిండీసు గాలీ ఉండవన్నా. గాలి ఉండేది ఒకటే.

  ReplyDelete
 2. Really?? "గాలి ఎక్కడైనా ఒక్కటే" అనే సిద్ధాంతానికి నీకు నోబెల్ ప్రైజు ఎందుకు రాలేదు?
  పల్నాటి గాలి మీదా ఇంకా వివరణ కావాలా? కావాలంటె చెప్పు. మొహమాట పడకూ. ఏంపర్లేదు.

  ReplyDelete
 3. I'm ready bro. I'm ready. నాకు నోబెల్ సంగతి సరే. మీకేమన్నా పేటెంటు కావాలా? చెప్పండి. మొహమాట పడటం నాకు తెలియదు కానీ చెప్పన్న వింటాను.

  ReplyDelete
 4. పడేయ్ ఇటు ఓ నాలుగు. ఏంపోయింది, యాణ్ణోసోట పడేస్కుంటా. మాంచి, ఏటి, మాంచి డబ్బొచ్చే పేటెంట్లు, ప్రత్యేకంగా సెప్పాల్సిన పనిలేదనుకో, నీకు తెల్సుగా.

  ReplyDelete
 5. అన్నా అసలు విషయం పక్కదోవ పట్టింది. అదేదో వివరించండి. మీకు MS Windows 7 patent ఇప్పిస్తాను. నాదేదో కామెంటు పోయినట్టుంది?

  ReplyDelete
 6. "ఇప్పటికీ అనగా 1999 వరకూ నాకుతెలిసి"

  Rightto. Even now.

  ReplyDelete
 7. MS Windows 7 patent!! అబ్బో!! చాలా చాలా పెద్ద మనస్సు తవది. [దొడ్డమనసు అయ్యవారిది. ఏమి మదీయ అదృష్టం]
  సరే
  ఓ ప్రాస కోసం అలా రాసాను. తమకి చెప్పియుండవలసింది. క్షమించేయండేం. నాకు అంత బుఱ్ఱ లేదు, అంతగా ఆలోచించలేక పొయ్యా.
  వెస్ట్ ఇండీస్ లో, పల్నాడులో ఒకే గాలి వీచునని గుర్తించలెక పొయ్యా. తప్పేసుమా. తమరు ఏ సిచ్చ ఏసినా అంగీకరిస్తా అని బల్ల (బల్ల యాడికిబోయినా బల్లేగా??) గుద్ది మరీ ఇవరించుకుంటన్నా.
  చూసారా, గమనించారా, అలా నేను కోడిపియ్య తొక్కటం వల్లనే తమబోటి పెద్దలు, వీరులు, శూరులు, కుబేరులు, నానా గుణసంపన్నులు విచ్చేసి నేతొక్కిన కోడిపియ్య వాసనజూసారు. లేకపోతే ఇలా వత్తురా, ఇటైపు సూసెదరా, సూసినా ఓ కామెంటేద్దురా, ఏసినా మళ్ళీ మళ్ళీ ఇవరాలు అడుగుదురా.
  మీ రాకతో నా బ్లాగు పావనమైంది..

  ReplyDelete
 8. Gags apart, the blog is informative. I came to it from Google. Very heartening to see a passionate write up on this area.

  ReplyDelete
 9. Sorry, I was kidding. Anyways, Thanks for paying a visit.

  ReplyDelete
 10. I have lost much of my contact with that area. I want to know about Palnadu. I expect a lot. Keep going.

  ReplyDelete
 11. brahmanaidu ante balayya kadaa?
  >>>

  అందుకే మండేది. చక్కగా చరిత్ర చెపుతుంటే వినక ఆ సినేమా వాళ్ళ గోలేందీ అంటా.

  ReplyDelete
 12. ఒక్కసారిగా వెళ్ళి నా కృష్ణమ్మ ఒడిలో మునక వేయాలన్నంత మనియాద కలిగింది. సాగర్ అన్న పేరుతోనే నాగుపాములా నాట్యమాడుతుంది నా మది. ఇక పల్నాటి చరిత్రలో ఇన్ని సంఘటనలు జరిగాయా, తెలుపుతున్నందుకు కృతజ్ఞతలు. పల్నాటి పౌరుషం కళ్ళకి కట్టిస్తున్నారు. ఇక పులుల మాట నిజమే, మా నాన్న గారి జీపు వస్తుండగా రోడ్డుకి అడ్డంగా పడుకునున్న పులిని చూసి డ్రైవరు, నాన్నగారు ఇక మనం ఇంటికి చేరము అనుకున్నారట, కానీ అది నెమ్మదిగా లేచి రోడ్డు దిగిపోవటం మా అదృష్టం. మల్లాది నవల "అదిగో పులి" లా తెలిసిన అంకుల్స్ కి కూడా పులుల్ని చూసిన అనుభవాలు వున్నాయి.

  ReplyDelete
 13. పల్నాడు లో పుట్టి పెరిగి న వాడ్ని మీ రచన వింటే ప్రతాప రుద్రవియం రాసిన వేంకటకవి గుర్తుకు వస్తున్నారు దానికి రామస్వామి గారు రాసిన పద్యం డిల్లి పక్కన గంగ ఉండేనో గంగ పక్కన డిల్లి ఉండేనో డిల్లీ లోన ఓడ ఎక్కిన ఓరుగల్లు ఎట్లు చేరును అనే పద్యం మరలా గురుతుకు వసున్ది మాచెర్ల ఎక్కడ కృష్ణా నది దాటితే మండది వస్తది మాచెర్ల కు మండాది 6 కిలోమీటర్లు దానికి

  ReplyDelete
 14. chala bagundi sir, chala chala vinali ani pustundi.nenu palnati ammaini madi palnadu

  ReplyDelete
 15. i am very intersterd about palnati charitra bcz iam also palnati bida i am from macherla

  ReplyDelete